JN: జిల్లాలో ఇసుకను పారదర్శకంగా, వేగంగా అందించేందుకు రూపొందించిన ‘ఈ-సాండ్ బుకింగ్ పోర్టల్’ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడం, ప్రజలకు సులభంగా ఖనిజాల సరఫరా చేయడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అన్నారు. వినియోగదారులు ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చని, రవాణా ప్రక్రియను పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.