MDK: రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం బడిబాట, విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం 33 వేల నోట్ పుస్తకాలను మంజూరు చేసింది. ఇవాళ్టి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇండెంట్ ప్రకారం వీటిని అందజేయడం జరుగుతుందని రామాయంపేట మండల విద్యాధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.