KMR: పిట్లంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి మృతి చెందడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిజాంసాగర్ మం. నర్సింగ్ రావుపల్లికి చెందిన కే. సాయిలు జ్వరంతో ఆసుపత్రికి వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు రెండు ఇంజక్షన్లు ఇచ్చిన అనంతరం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతికి గల కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.