E.G: దేవీపట్నం మండలం గంగంపాలెంలో పులి దాడిలో 14 ఆవు దూడలు, 2 గేదెలు మృతి చెందినట్లు రాజమండ్రి వన్యప్రాణి సంరక్షకులు ఎస్. నాగేశ్వరరావు తెలిపారు. బాధితులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లిస్తామని రంపచోడవరం డీఎఫ్ఓ ఎన్.రామచంద్రరావు, సబ్ డీఎఫ్ఓ టి. అనూష, అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ జే.వి.సుబ్బారెడ్డి తెలిపారు. పులి సంచారంతో పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు.