AP: అమరావతిపై కొంతమంది లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఏసీ రూమ్‌లో కూర్చొని మాట్లాడడం కాదని.. వచ్చి చూస్తే జగన్‌కు తెలుస్తుందంటూ చురకలంటించారు. రాజధాని రైతులు ఇబ్బందిపడతారని ప్రభుత్వం ఆలోచిస్తుందని.. పనులు ఆలస్యమైతే నిర్మించిన కట్టడాలు వృథా అవుతాయన్నారు. అందుకే రైతులను ల్యాండ్ పూలింగ్‌కు రావాలని ఇప్పటికీ కోరుతున్నట్లు చెప్పారు.