ASR: రాజవొమ్మంగి మండలం శరభవరంలో ఇవాళ ఉదయం రామాలయం సమీపంలో భారీ వృక్షం రహదారిపై కూలిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సంఘటనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి కూలిన చెట్టును తొలగించి, రహదారిని పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.