AP: కేంద్ర రాయితీతో ఆర్టీసీయే బస్సులు నిర్వహించాలని NMUA డిమాండ్ చేసింది. డిపో స్థలాలు లీజు పేరిట ప్రైవేటుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పింది. ఆర్టీసీ సమస్యలు, స్త్రీ శక్తి పథకం ప్రభావంపై చర్చకు సమావేశమవుతామని ఆర్టీసీ ఈయూ తెలిపింది. జూన్ 8న విజయవాడలో ఉద్యోగ సమావేశం ఉంటుందని స్పష్టం చేసింది. సమావేశం అనంతరం భవిష్యత్ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించింది.