KKD: అన్నవరం వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. బెండపూడికి చెందిన బుచ్చిబాబు (60) పుట్టినరోజు కావడంతో భార్య, మనవరాలితో వ్రతమాచరించి స్వామిని దర్శించుకున్నారు. పడమర రాజగోపురం వద్ద అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఓ భక్తుడు సీపీ ఆర్ చేసి 108 వాహనంలో కొండ దిగువున ఉన్న దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడు.