మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ దేవస్థానం నూతన EOగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ దేవదాయ శాఖ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులను కలిసిన ఆయన, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.