RR: తెలంగాణలో ప్రత్యేక రిమిషన్ ద్వారా 91 మంది యావజ్జీవ ఖైదీలను విడుదల చేశారు. ప్రభుత్వం 38 మందికి ఉపాధి అవకాశాలు కల్పించగా.. మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లు అందజేశారు. పునరావాసం, సామాజిక పునఃసమైక్యం కోసం చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా వివరించారు. ఖైదీల జీవిత పునర్నిర్మాణానికి ఇది కీలక అడుగుగా ఆమె పేర్కొన్నారు.