PLD: దాచేపల్లి మార్కెట్ యార్డ్లో మంగళవారం మిర్చి ధరలు భారీగా పలికాయి. ఈ సీజన్లోనే అత్యధికంగా ‘సూపర్ 10’ రకం క్వింటా రూ.25,500 రికార్డు రేట్ దక్కించుకోగా, ‘తేజ’ రకం రూ.21,850 పలికింది. మార్కెట్ పెరుగుతుందని ఆశతో తమ పంటను కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరుచుకున్న రైతులకు ఈ ధరలు తీవ్ర సంతోషాన్ని ఇస్తున్నాయి.