PDPL: 2026-27 విద్యా సంవత్సరానికి ధర్మారం మండలానికి నాలుగు ప్రీ-ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్లు ఎంఈవో ప్రభాకర్ మంగళవారం తెలిపారు. రచ్చపల్లి, ఖానంపల్లి, ధర్మారం, కటికనపల్లి ప్రాథమిక పాఠశాలలకు అనుబంధంగా వీటిని నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి పాఠశాలలో టీచర్, ఆయాను నియమించి బోధనోపకరణాలు, ఆటవస్తువులు, ఫర్నిచర్, యూనిఫాంలు అందిస్తామని పేర్కొన్నారు.