KDP: వేంపల్లెలోని ఓ కాలనీకి చెందిన ఓ బాలిక (17)ఆత్మహత్య చేసుకున్నట్లు SI తిరుపాల్నాయక్ మంగళవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు..ఇటీవలే ఆ బాలిక ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది.ఇటీ వల కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చూపించారు.మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.