SRD: జూన్ నెలకు సంబంధించిన దివ్యాంగుల యూడీఐడీ సదరం షెడ్యూల్ను విడుదల చేసినట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. 3, 10, 17, 24 తేదీల్లో సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం జరుగుతుందని చెప్పారు. శిబిరం కోసం స్లాట్ నిరంతరం బుక్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.