కోనసీమ: నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత కమిటీ పాలకవర్గం ఏడాది పదవీకాలం గత నెల 26వ తేదీతో ముగిసింది. దీంతో మరో ఆరు నెలలు పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పొడిగింపు ప్రస్తుత సభ్యులతోనే కొనసాగుతుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. జీవో 467ను ప్రభత్వం విడుదల చేసింది.