ATP: గుత్తి రూరల్ పరిధిలోని జక్కలచెరువు ఆర్ఎస్ గ్రామంలో టెంకాయ చెట్టుపై పిడుగుపడి మంటలు వ్యాపించాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంలో అంగడి రాజన్న ఇంటి ఆవరణలోని చెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగు శబ్దానికి ఇళ్లు కంపించడంతో భూకంపమని భావించి ప్రజలు బయటకు పరుగులు తీశారు.