KDP: వ్యవస్థీకృత ఆర్థిక నేరాలపై నిఘా పెట్టామని, ఉక్కు పాదంతో అణిచివేస్తామని పొద్దుటూరు ASP విభుకృష్ణ హెచ్చరించారు. ఆయన తన కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. క్రికెట్టును ఆటగా ఆస్వాదించాలే తప్ప, డబ్బులు పెట్టి బెట్టింగ్ కాస్తే వ్యవస్థీకృత ఆర్థిక నేరాల క్రింద బుక్ చేస్తామన్నారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ చేస్తే వదిలిపెట్టేది లేదన్నారు.