టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నాయో చెప్పాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు ఎటు పోతున్నాయని నిలదీశారు.
ప్రభుత్వ వైఫల్యాలతో సామాన్యుల జీవితాలు చిధ్రం అవుతున్నాయని విమర్శించారు. గుంతల రోడ్డు కారణంగా చిన్నారి మృతి, ఆస్పత్రిలో ఓ వ్యక్తికి బిల్లు, పెన్షనర్ల వార్తలను ట్యాగ్ చేస్తూ బాబు ట్వీట్ చేశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.