వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై సతీష్ జవ్వాజి దర్శకత్వంలో నాని హీరోగా ఓ మూవీ రాబోతుందని వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారానికి నిర్మాణ సంస్థ బ్రేక్ వేసింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని కొట్టిపారేసింది. తమ మూవీల అప్డేట్స్ను కేవలం అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే ప్రకటిస్తామని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రేక్షకులను కోరింది.