NZB: అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని, తెలంగాణ అమరుల ఆశయ సాధన బీజేపీతోనే సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.