మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వర్క్ షాప్లో అనకాపల్లి జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ, తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే రాజు, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతయ్య బాబు పాల్గొన్నారు.