GNTR: దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న చలో దుగ్గిరాలకు పిలుపునిచ్చారు. తెనాలిలో జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. రైతులకు క్వింటాల్‌కు రూ.7 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం అందజేశారు.