TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. ‘తెలంగాణ సుభీక్షంగా ఉంది. పవన్ తన ఫోకస్ ఏపీపైనే పెడితే బాగుంటుంది. అన్నదమ్ములుగా ఉన్న రాష్ట్రాల మధ్య సభల పేరిట విద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టవద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.