MBNR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉన్న అమరుల స్థూపానికి పాలమూరు జర్నలిస్టులు మంగళవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఉద్యమ సందర్భంగా ఎంతోమంది అమరులు అయ్యారని వారి త్యాగాలు వెలకట్టలేనివి అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు.