ELR: కామవరపుకోట(m)ఆడమిల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పనులు చేయడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన యువతి ఎలుకల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి మృతి చెందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.