TG: మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూపోరాటం చేస్తామని తెలంగాణ రక్షక్ పార్టీ అధ్యక్షురాలు కవిత అన్నారు. జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో పోరాటం చేస్తామని, పార్టీలకతీతంగా అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై సీఎం నుంచి ప్రకటన రాలేదని, ఆగస్టు 6 లోపు ట్యాంక్‌బండ్‌పై జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.