TG: నటుడిగా పవన్ కళ్యాణ్‌ను అందరం అభిమానిస్తామని, అభిమానించినప్పటికీ రాజకీయంగా వ్యతిరేకిస్తామని TPCC చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆంధ్ర మూలాలు ఉన్న నాయకుడు అని, ఆయన ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారని గుర్తుచేశారు. పవన్ వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. కాగా, ఇవాళ పవన్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.