తెలుగు రాష్ట్రాలు ఏర్పడి 12 ఏళ్లయినా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ, TG అభివృద్ధిలో పోటీపడాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. HYD, అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలని, ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.