NZB: పశువులను అపహరిస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. బోధన్‌కు చెందిన ఖురేషి అబ్దుల్లా అనే వ్యక్తికి ఒక్కో పశువును రూ. 7 వేలు – రూ. 8 వేలకు విక్రయించినట్లు విచారణలో తెలిసింది. నిందితుల నుంచి పోలీసులు ఐదు సెల్ఫోన్లు, రెండు వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం, రూ. 20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.