TG: పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ స్పీచ్ మధ్యలోనే ఆపేశారు. ఎండ తీవ్రతతో త్వరగా ముగిస్తున్నట్లు చెప్పారు. 15 పేజీల ప్రసంగాన్ని కేవలం 10 పేజీల వద్ద నిలిపివేశారు. సభకు హాజరైన వారికి అందించిన బుక్లెట్లలో పూర్తి ప్రసంగం ఉందని.. ప్రజలు, మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.