NLG: దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలునాయక్ జాతీయ జెండాను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకుని అభివృద్ధి జరుగుతుందన్నారు.