12 ఏళ్లకు ఒకసారి పుణ్యనదులకు పుష్కరాలు వస్తాయి. ఈ ఏడాది యమునా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నదీతీరంలో పితృదేవతలకు శ్రాద్ధకర్మలు, వారిపేరు మీద దానధర్మాలు చేస్తారు. యమునా సది దేశంలోని పవిత్ర నదులలో ఒకటి. గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో యమునాలో స్నానం చేయడం పవిత్రం. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, యూపీ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తోంది.