RR: మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎల్బీ నగర్ ప్రాంతం పోరాటాల వేదికగా నిలిచింది. ఇక్కడి చౌరస్తాలోనే అమరవీరుడు శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం ఉద్యమాన్ని దావాగ్నిలా రగిల్చింది. ఆయనతో పాటు సతీశ్ యాదవ్, యాదగిరి, శ్యాంసుందర్ రెడ్డి లాంటి ఎందరో స్థానిక నాయకులు, విద్యార్థి జేఏసీలు సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్‌లో కీలక పాత్ర పోషించారు.