గోపీచంద్ 34వ చిత్రం షూటింగ్ ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. పాపులర్ స్టంట్ మాస్టర్ వీ వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనార్కలి నాజర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘యాత్ర’ ఫేమ్ 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతమందిస్తున్నాడు.