AP: కుల, మత విధ్వంసాలు, ప్రజలను రెచ్చగొట్టాలనే కుట్రలను ఇకనైనా వీడాలని YCP నేతలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు. నంద్యాలలో YSR విగ్రహాన్ని YCP నేతే ధ్వంసం చేసి.. ఆ కుట్రలో TDPని ఇరికించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. అబద్ధాల పునాదులపై పుట్టిన YCP.. AP అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతోందని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కుట్ర చేస్తోందని విమర్శించారు.