ATP: అనంతపురం నగరంలోని బుడ్డప్ప నగర్లో సోమవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పంపిణీ చేశారు. లబ్ధిదారులతో జేసీ నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నెల నెల పింఛన్లు పంపిణీ చేస్తున్నారా, ఎవరైనా డబ్బులు అడిగారా అంటూ ఆరా తీశారు.