WGL: పర్వతగిరి మండలంలో 2027 జనగణనను పకడ్బందీగా నిర్వహించాలని తహశీల్దార్ వెంకటస్వామి సూచించారు. సోమవారం తురుకల సోమారం, జమాల్ పురం గ్రామాల్లో గృహ గణన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్లకు పలు సూచనలు చేసిన ఆయన, జనగణనలో అప్రమత్తంగా ఉండి పూర్తి వివరాలు సేకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్వీ శ్రవణ్ పాల్గొన్నారు.