BDK: అశ్వాపురం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎట్టా శ్రీనివాసరావు (శీనన్న) 36 ఏళ్ల సుదీర్ఘ సేవ అనంతరం పదవీ విరమణ పొందారు. క్రమశిక్షణ, నిజాయితీ, సేవా భావంతో ప్రజల మన్ననలు పొందిన ఆయనకు అధికారులు, సహచరులు, స్థానికులు ఘనంగా వీడ్కోలు పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలు యువ పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు.