HYD: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పీఎం స్వనిధి పథకం విజయవంతంగా 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. వీధి వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలు, సామాజిక భద్రత కల్పిస్తూ ఈ పథకం ఆర్థిక అండగా నిలిచింది. లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయం 20 శాతం పెరిగినట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్న వ్యాపారుల జీవనోపాధి మెరుగుపడటంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది.