ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసే ఆన్లైన్ నెగెటివిటీ వల్లే తన ‘LIK’ సినిమా బాక్సాఫీస్ వద్ద దెబ్బతిందని డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పరిశ్రమలో పెద్దల మద్దతు లేని సినిమాల తలరాతను ఈ తప్పుడు రివ్యూలు మార్చేస్తాయని, ఇవి దర్శకుల కలలను ముక్కలు చేస్తాయని మండిపడ్డాడు. మంచి ఓపెనింగ్స్ వచ్చినా కథ ఇలా మారిపోవడాన్ని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని అన్నాడు.