ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఐదుగురు నిందితులకు అవెన్యూ కోర్టు(Avenue court) బెయిల్(bail) మంజూరు చేసింది. వారిలో సీబీఐ(cbi) దర్యాప్తు చేస్తున్న సమీర్ మహేంద్రు, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, మూత గౌతమ్‌లకు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ మంగళవారం రెగ్యులర్(regular) బెయిల్(bail) మంజూరు చేశారు. ఈ కేసులో ఇద్దరు మాజీ ఎక్సైజ్ శాఖ అధికారులతో సహా ఐదుగురు నిందితులకు ఈ కోర్టు బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో గతంలో కోర్టు(court) వీరికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో వ్యాపారవేత్త(businessman) సమీర్ మహేంద్రు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగనున్నారు. మరో ఇద్దరు నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లికి ఇదే కోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసింది. అయితే, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఎందుకంటే వీరు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఎక్సైజ్ మనీ లాండరింగ్ కేసు(money laundering case) ద్వారా అరెస్టు(arrest) చేయబడ్డారు. వీరి బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఇదే కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(manish sisodia)ను కూడా సీబీఐ(cbi) ఆదివారం అరెస్టు చేసింది. కోర్టు అతన్ని మార్చి 4, 2023 వరకు రిమాండ్‌కు పంపింది. సమర్థవంతమైన దర్యాప్తు కోసం ఢిల్లీ డిప్యూటీ సీఎం కస్టడీ ఇంటరాగేషన్ అవసరమని సీబీఐ న్యాయవాది(cbi lawyer) కోర్టుకు తెలిపింది. సీబీఐ ఇటీవల ఏడుగురు నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది. వారిలో నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోనిపల్లిని మాత్రమే అరెస్టు చేసినట్లు తేలింది. వారిద్దరి బెయిల్ గురించి హైకోర్టులో సవాలు చేస్తున్నారు. మరో ఐదుగురు నిందితులను అరెస్టు(arrest) చేయకుండానే చార్జిషీట్(charge sheet) దాఖలు చేసినట్లు కోర్టు పేర్కొంది. ఇంకోవైపు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లికి బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సీబీఐ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది.