ADB: బోథ్ మండల కేంద్రంలో వడ్రంగుల వర్క్ షాప్‌కు అనుమతి ఇప్పించాలని బోథ్ పట్టణ వడ్రంగుల సంఘం నాయకులు ఈరోజు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు వినతి పత్రాన్ని అందించారు. అనుమతి పొందిన టింబర్ డిపోల నుండే కర్రను వాడుతున్నామని తెలిపారు. అందరం కూడా కులవృత్తిని నమ్ముకున్నామని మాపై దయ ఉంచాలని కోరారు.