NLG: కనగల్ మండలం అమ్మగూడెం గ్రామానికి చెందిన కొండ గణేష్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పీహెచ్డీ (PhD) పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సందర్భంగా ఆయన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసంలో ప్రతిభ చాటిన గణేష్‌ను భూపాల్ రెడ్డి అభినందించారు.