NLR: అనంతసాగరంలో తహసీల్దార్ జయవర్ధన్ను సస్పెండ్ చేశారు. మండల కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగిని తీవ్రంగా వేధించి, లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో, విచారణ అనంతరం తహసీల్దార్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ జయవర్ధన్ను సస్పెండ్ చేశారు.