TG: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని సీఎం సలహాదారు, MP వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. జూన్ 2న అపాయింటెడ్ డే ప్రకటించాలని, బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆయన.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి సజావుగా విలీనం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.