WNP: లోయర్ జూరాల విద్యుత్ ప్లాంట్ నుంచి శుక్రవారం ఉదయం నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో గద్వాల్ మండలం కొత్తపల్లి- జూరాల గ్రామం మీదుగా గద్వాల వెళ్లే వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఎస్సై జయన్న గురువారం తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయంగా జూరాల ప్రాజెక్టుపై నుంచి లేదా ఇతర మార్గాల ద్వారా గద్వాలకు వెళ్లాలని సూచించారు.