గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో గురువారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. MLA గళ్ళా మాధవి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. మహానాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంటూ, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలన్నారు.