KDP: ఖాజీపేట మండల పరిధి మిడుతూరు నుంచి ఏటూరు మార్గంలో రోడ్డుకి ఇరువైపులా కంపచెట్లు పెరిగి ప్రమాదకరంగా మారుతున్నాయని వాహనదారులు పేర్కొన్నారు. ఈ మార్గంలో గ్రామస్థులు ద్విచక్రవాహనాలు, ఆటోల్లో ప్రయాణం సాగిస్తున్నారు. మలుపులో ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు కంపచెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.