KRNL: దిన్నె దేవరపాడు గ్రామ ప్రజల సొంతింటి కలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు క్రాంతి నాయుడు డిమాండ్ చేశారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలకు ఇప్పటికీ సర్వే, హద్దుల నిర్ణయం జరగకపోవడం వల్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి నోచుకోవడం లేదన్నారు. గ్రామస్థులతో సమావేశమైన ఆయన, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు.