VZM: డెంకాడ మండలం రాజులతమ్మపురం గ్రామంలో గ్రామస్తులకు చట్టాలపై ఎస్సై సన్యాసినాయుడు గురువారం అవగాహన కల్పించారు. గంజాయిపై సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి మహిళ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. గ్రామాల్లో దొంగతనాల అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని కోరారు. అత్యవసర సమయాల్లో 100/112 నెంబర్కి ఫోన్ చేయాలని కోరారు.